సాక్షి డిజిటల్ న్యూస్ కళ్యాణదుర్గం జనవరి 20 అనంతరం జిల్లా ఇన్చార్జ్ ముంగా ప్రదీప్ ముంగా ప్రదీప్: అనంతపురం జిల్లా పరిధిలో విశ్వకవిగా యోగివేమనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి యూనెస్కో విభాగం ప్రపంచ బాషా కవులలో యోగివేమన ను గుర్తించడం మనమందరం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..నేడు కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగివేమన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తోంది. చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారధి, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ విశ్వకవి యోగివేమన సమాజంలో జరుగుతున్న మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాశాలపై పద్యరూపంలో పాడుతూ వాటిని రూపుమాపెందుకు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి జ్ఞాన భోద చేసి విశ్వ కవిగా ప్రసిద్ధి చెందారని అలాంటి మహనీయుని జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వకారణం అన్నారు.