విజయవంతంగా ముగిసిన సిపిఐ పార్టీ శత వసంతాల ముగింపు సభ

* కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సభ.

సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి, పాల్వంచ. రిపోర్టర్ కె.జానకిరామ్: భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 18-1-2026 న ఖమ్మం లో పదిహేను వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలు, వెయ్యి మంది రైతులు, కార్మికులు, లాయర్ లు, వివిధ కులవృత్తుల వారు, ప్రజానాట్యమండలి-జాన పద తదితర కళాకారులు, లక్షల మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు తో ఖమ్మం లో భారీ ప్రదర్శన నిర్వహించి, ఎస్ఆర్ & బిజియన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించటం జరిగింది. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టు మల్లువిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, 40 దేశాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేతలు ఈ సభకు హాజరయ్యారు. సిపిఐ మరియు పార్టీ అనుబంధ ప్రజా సంఘాల కేంద్ర, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *