లైబ్రరీని సందర్శించిన జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి.

సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ ప్రభుత్వ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆదివారం సందర్శించారు. గ్రంథాలయంలోని వసతులను ఆయన పరిశీలించారు. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రశాంతంగా సన్నద్ధం కావడానికి భవనంపై ఉన్న గదిని వినియోగించుకునేలా సౌకర్యం కల్పించాలని సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ను ఆయనను కోరారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్, ఉపసర్పంచ్ షేక్ నిస్సార్,రైడ్స్ సంస్థ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్,కార్యదర్శి పార్వతి శేఖర్,డౌర్ సాయిలు, గాండ్ల శ్రీనివాస్, వడ్ల నరేష్,వార్డు మెంబర్లు, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.