సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 రిపోర్టర్ సంజీవ్: అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం రోడ్డు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు పాటించాలని వాహన డ్రైవర్లుకు ఎస్సై సూచన సలహాలు ఇచ్చారు. అల్లూరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్గర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో పర్యాటక ప్రాంతమైన చాపరై జలపాతం వద్ద వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎస్సై సురేష్ మాట్లాడుతూ ఎక్కువగా పర్యాటకులు తిరుగు ప్రయాణంలో అతివేగముగా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తమ గమ్యస్థానంలో చేరేవరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పర్యాటకులు తమ సొంత వాహనములో ఘాట్రోడ్లో పొగ మంచు ఉండటం వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని తెలిపారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించుకోవాలని సూచించారు. కార్ నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించుకోవాలన్నారు. ఆటో జీపు పరిమితికి మించి ఎక్కించవద్దని చెప్పారు వాహనానికి తప్పనిసరి రికార్డులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సంబంధిత ఆటో కార్ జీప్ పర్యాటకులు పాల్గొన్నారు.