సాక్షి డిజిటల్ న్యూస్, 20 జనవరి, మహాదేవపూర్ తులసి మహేష్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని కొన్ని నెలల క్రితం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన మరణించిన పట్టి వెంకటస్వామి కుమారుడైన పట్టి మధుసూదన్ జ్ఞాపకార్థం తన కుమారుని జన్మదిన వేడుకలను తన యొక్క సమాధి వద్ద నిర్వహించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించి తండ్రికి. గర్వకారణంగా నిలుస్తారనుకున్న విధి ఆటలో మృత్యువుడు గుడిలోకి చేరారు. గుండెకు భారమైన తన జ్ఞాపకాలే జీవనంగా కొనసాగిస్తూ సోమవారం మధుసూదన్ బర్త్ డే వేడుకలు పట్టి వెంకటస్వామి తన బంధుమిత్రులు శ్రేయభాశులతో నిర్వహించారు. అంబటి పెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులు చేతుల మీదుగా మధుసూదన్ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించి అతని ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పట్టి వెంకటస్వామి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులతో పాటు బిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ లింగంపల్లి శ్రీనివాసరావు బిఆర్ఎస్ మాజీ సింగల్ విండో డైరెక్టర్ లింగంపల్లి మాధవరావు. మరియు సీనియర్ బి ఆర్ఎస్ నాయకులు బొంపెల్లి సత్యనారాయణ గ్రామ కార్యదర్శి రమేష్ . స్థానికులు పాల్గొన్నారు.