మంగళగిరి లోని రక్తదాన శిబిరం పాల్గొన్న మండల టి డి పి నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 20: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన కార్యకర్తలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకునే అవకాశం కల్పించడంలో తమ అమూల్యమైన సహకారంతో చొరవ చూపిన ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, వైకుంఠం ప్రసాద్ టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షులు ముల్లా మొయిన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షులు ముల్లా మొయిన్ మాట్లాడుతూ రక్తదానం చేసిన కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సర్టిఫికెట్లు అందజేశారన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఆత్మీయంగా, ఘనంగా జరిగిందని. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షులు ముల్లా మొయిన్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సర్టిఫికెట్ అందజేయడం గర్వకారణంగా నిలిచిందన్నారు. అలాగే ఈ సమావేశంలో ముల్లా మొయిన్ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలసి, హోళగుంద మండలంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా 2019 సంవత్సరంలో మంజూరైన ఎస్‌డీఎఫ్ గ్రాంట్ ద్వారా చేపట్టవలసిన సీసీ రోడ్డు పనుల విషయాన్ని కూడా వివరించారు ఈ అన్ని విషయాలను శ్రద్ధగా విన్న ముఖ్యమంత్రి మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం, అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ మండల అధ్యక్షులు ముల్లా మొయిన్ తమ సమస్యలను సానుకూలంగా విని హామీ ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనారిటీ శాఖ మంత్రి గౌరవనీయులు ఎన్ఎండీ ఫారూక్, ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, అలాగే వైకుంఠం ప్రసాద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *