సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 20: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో హోళగుంద టిడిపి సీనియర్ నాయకులు బుడగ జంగాల రామాంజి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేసిన కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని వారు తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న మండల టీడీపీ సీనియర్ నాయకుడు బుడగ రామాంజీ కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సర్టిఫికెట్ అందజేయడం గర్వంగా ఉందన్నారు. అలాగే ఈ సమావేశంలో బుడగ రామాంజి ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలసి, హోళగుంద మండలంలో ఉన్న బుడగజంగల్ కాలనీలో విద్యుత్ తీగలు గురించి అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. విషయాలను శ్రద్ధగా విన్న ముఖ్యమంత్రి, మీ సమస్యలను తప్పకుండా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.