బాదల్గాం గ్రామ సర్పంచ్ మమత నర్సింహులను ఘనంగా అభినందించిన మానవహక్కుల సంస్థ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 20 ప్రతినిధి దుమ్మ రాజు: నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బాదల్గాం గ్రామ నూతన సర్పంచ్ మమత నర్సింహులును నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, న్యాల్కల్ మండల అధ్యక్షులు బి. నవీన్, బి. రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామానికి చెందిన విజయ్ కలిసి సర్పంచ్‌ను అభినందించారు. నూతనంగా సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, గ్రామాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.అలాగే మహారాష్ట్ర రాష్ట్రం పూణే నగరంలో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ షాప్ కార్యక్రమంలో సర్పంచ్ మమత నర్సింహులు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామస్థాయి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి, సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ప్రతినిధులు మరియు సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. బాదల్గాం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగగా, గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.