సాక్షి డిజిటల్ న్యూస్, 20 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామన్నపేట ప్రీమియర్ లీగ్ సీజన్–4 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో, నూతన సంవత్సరం–సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నీలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.టోర్నీలో విజేతలుగా నిలిచిన జట్లకు రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ చేతుల మీదుగా ప్రధమ బహుమతిగా రూ.25,000, ద్వితీయ బహుమతిగా రూ.15,000లను ప్రదానం చేశారు. గ్రామీణ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ టోర్నీని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు జెల్ల వెంకటేశం, గొలుసుల ప్రసాద్, గండికోట ప్రతాప్, మహమ్మద్ అజార్ పాల్గొని విజేతలను అభినందించారు. అలాగే క్రీడాకారులు వెంకటేష్, నరేష్, మజీద్, బాలు, మిట్టు, విష్ణు, నవీన్, వంశీ, శివ, బాలాజీ, ఆరిఫ్, చింటూ, ప్రవీణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఐక్యత, క్రమశిక్షణతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.