పోగొట్టుకున్న 60 వేల మొబైల్ ఫోన్ను అప్పగించిన దంపతులు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు జనవరి 20 2026: నందిగామ లో నివాసం ఉంటున్న షేక్ జాన్ పాషా అనే వ్యక్తి కోదాడ రోడ్ లో ఫోన్ పోగొట్టుకున్నాడు. చాలా విలువైన ఫోన్ పోగొట్టుకున్నాడని చాలా బాధపడ్డాడు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఫోన్ తిరిగి తన దగ్గరికి చేరుకుంది. అది వివరాల్లోకి వెళ్దాం ఖమ్మం జిల్లా గోపారం గ్రామంలో నివాసం ఉంటున్న మలోగి దేవరాజు రమాదేవి దంపతులకు కోదాడ రోడ్లో ఫోన్ దొరికేసరికి వెంటనే ఇద్దామన్న ఏ నెంబర్ కి కాల్ చేయాలో అర్థం కాక ఫోన్ కొన్ని గంటల వరకు తమ దగ్గరే ఉంచుకున్నారు. పోగొట్టుకున్న వ్యక్తి ఫోన్ చేయగానే అయ్యా మేము ఖమ్మం వచ్చాం మీ ఫోన్ మా దగ్గరే భద్రంగా ఉంది నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు. వెంటనే మేము ఫోన్ నీకు తీసుకొని వచ్చి ఇస్తామని చెప్పి తెలిపారు. చెప్పినట్టే ఫోన్ తీసుకొచ్చి తన నిజాయితీ చాటుకున్నారు. మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న చోరీకి గురైన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించిన అవసరం లేదు. ఈ విషయంపై ఫోన్ యజమాని 60 వేల రూపాయల ఫోను నాకు తిరిగి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని దంపతులు నిజాయితీకి ఫిదాయానని తెలిపారు. పరాయి వస్తువులు దొరికితే వాటిని తస్కరించే రోజులు ఇవి అటువంటిది ఓ దంపతులు దొరికిన ఫోను బాధితునికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.