సాక్షి డిజిటల్ న్యూస్ రాప్తాడు జనవరి 20 అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ముంగా ప్రదీప్: పీఏబిఆర్ కుడికాలువకు నీటి సామార్థ్యాన్ని పెంచాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె బెంగళూరు జాతీయ రహదారి పై ఉన్న గొల్లపల్లి వద్ద పీఏబిఆర్ కుడికాలువను పరిశీలించారు. స్థానిక టీడీపీ నాయకులు, రైతులతో కలసి కాలువను పరిశీలించారు. నీటి వేగం, సామర్థ్యం చాలా తక్కువగా ఉండటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆమె అధికారులను అడిగి ఆరాతీశారు. నీరు అంత తక్కువ సామర్థ్యంతో వస్తే.. చివరి చెరువుకు నీరు ఎప్పుడు చేరుతుందని. అన్ని చెరువులకు నీరు అందేందుకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఈ నెల 13వ తేదికి చివరి చెరువుకు నీరు చేరాల్సి ఉండేదన్నారు. నీటి విడుదల ఆలస్యమైందని. అందునా 25వ కిలోమీటర్ వద్ద నుంచి నీటి వేగం సంతృప్తికరంగా లేదన్నారు. కేవలం మూడు అడుగుల లోపు మాత్రమే నీరు వస్తే. చివరి చెరువుకు నీరు ఎప్పుడు చేరుతుందన్నారు. నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా చూడాలన్నారు. ఈ సారి రాప్తాడు, ధర్మవరం ప్రాంతంలోని అన్ని చెరువులకు నీరు అందేలా చూస్తామని ఆమె చెప్పారు.