పిడపర్తి రేష్మ ఫ్లోరిన్ ఏపీ ఎస్ఆర్టీసీలో

★ రావులపాలెం డిపో నందు కండక్టర్గా పని చేస్తున్నా.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు: అమలాపురం జిల్లా కలెక్టరేట్ నందు వెన్నుపూస అరుగుదలతో కేవలం బెడ్ రెస్ట్ కు పరి మితమైన సందర్భంగా స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడానికి ముందుకు వచ్చారని ఆమె కుమారునికి ఆర్టీసీలో ఉద్యోగావకాశం కల్పిం చాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ని సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు కోరారు. రేష్మ ఫ్లోరిన్ స్వస్థలం కోనసీమ జిల్లా రామచంద్రపురం అని ఈమె ఇటీవల వెన్నుపూస అరుగుదలతో కాళ్లు చేతులు సక్రమంగా పని చేయని కారణంగా స్వచ్ఛంద పదవి విరమణ కోరుతూ అభ్యర్థన సమ ర్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే ఆర్టీసీ డిపో నందు ఆమె కుమా రునికి ఉద్యోగం కల్పించా లని జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వారు సానుకూలంగా స్పందించి ఆర్టీసీ వారి ద్వారా తగు చర్యలు చేపడతానని ఆమెకు హామీ ఇచ్చారు.