పిటిఎం మండలంలో విద్యుత్ పోలు పైనుంచి పడి యువకుడు దుర్మరణం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి: అన్నమయ్య జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. తంబళ్ళపల్లి నియోజకవర్గం పిటిఎం మండలంలో కరెంట్ ఫోన్ ఎక్కి మరమ్మత్తు పనులు చేస్తుండగా కిందపడి యువకుడు మృత్యువాత చెందాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని కే రామిరెడ్డిపల్లి, గ్రామం, గుగ్గిళ్ళ వారి పల్లి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తున్న యువకుడు కె రామిరెడ్డి (23) ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు, మెరుగైన చికిత్స కోసం బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ డాక్టర్ పరీక్షించగా అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.