సాక్షి డిజిటల్ న్యూస్ బలిజిపేట మండల రిపోర్టర్ సిహెచ్ మురళి 20.01.26: మండలంలోని మూడు క్లస్టర్ల పరిధిలో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రగతి నివేదికలను అందచేయాలని బలిజిపేట ఎంఈఓ 1 సామల సింహాచలం అన్నారు. సోమవారం మండల విద్యాశాఖ కార్యాలయంలో జీఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమంపై సీఆర్పీ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ సీఆర్పీలు తమ క్లస్టర్ల పరిధిలో గల పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రగతి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్యారెంటీ ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం పై దృష్టి సారించాలని, మండలంలోని అన్ని పాఠశాలల్లో జి ఎఫ్ ఎల్ ఎన్ సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్ ఏ 3 మార్కులు ఆన్ లైన్ లో నమోదు చేయించాలని, ముస్తాబు, మన్యం డాన్స్ కార్యక్రమాలు చక్కగా జరిగేలా చూడాలన్నారు. పాఠశాల స్థాయిలో ఎక్కడైనా ఎటువంటి సమస్యలున్నట్లైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు మధు, సుభాషిణి, వైకుంఠ రావు, సాంబశివరావు ఎల్డీఏ భద్ర పాల్గొన్నారు.