సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ గంగాడ గౌరీ శంకర్: ముద్దు ముద్దు మాటలతో, చిలిపి నవ్వులుతో కేరింతలతో ఆతల్లి కొంగు పట్టుకుని తిరిగే తమ కుమారుడి పట్ల విధి కన్నుకొట్టింది. అంతు చిక్కని వ్యాధితో మంచానికే పరిమితం చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఉలుకు పలుకు లేకుండా మంచాన పడి వుండడం తో ఆ తల్లి మనసు తల్లడిల్లి పోయింది. కొడుకు ఒక్కసారి అయినా అమ్మ అని పిలవకపోతాడా అని గంపెడు ఆశతో ఎదురు చూస్తుంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన జంపా త్రినాధ రావు గాయత్రి ల కుమారుడు చైతన్య అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడు. నవమాసాలు మోసి కని పెంచిన కొడుకు వేలాది మంది లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో ఉలుకు పలుకు లేకుండా మంచాన పడి వుండడం తో పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకుని తమ కొడుకు ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆదేవుని శాపమో, విధి కి కన్ను కొట్టిందో ఏమో గాని మాయదారి రోగంతో పసి ప్రాణం విలవిలాడుతుంది. 5 ఏళ్ల వయసులో వచ్చిన జ్వరం తగ్గకపోవడంతో శ్రీకాకుళం ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ వైరస్ (ఎస్ ఎస్ పి ఈ) అరుదైన వ్యాధి వచ్చిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా బోరున వినిపించారు. తమ కుమారుని ఆరోగ్యముతో చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అప్పులతో వైద్యం అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడికి వంచింగ్ చేసేందుకు ఆ తల్లిదండ్రుల ఆరాటం ఇంత అంతా కాదు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి వైద్యం చేయిస్తున్నారు. అప్పటినుండి చైతన్య నడవలేడు కూర్చోలేడు తినలేడు మాట్లాడలేడు వినిపించిన వినపడినట్టు ఉంది గుండెలు కొట్టుకుంటాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుని పరిస్థితిని చూసి తట్టుకోలేక పోతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం హైదరాబాద్ విజయవాడ వంటి పట్టణాల్లో చైతన్యకు వైద్యం చేయించారు.ఇదిలా ఉంటే ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యేందుకు చాలా సమయం పడుతుందని, ఖరీదైన వైద్యం అందించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పటంతో కొంతమంది వైద్యుల సలహాలతో మహారాష్ట్ర లోని పూణేలో సెంట్ ఫర్ లైఫ్ సైన్సెస్ హోమియోతెరఫీ డాక్టర్ పవ్వల్ గువ్వంత్ అర్జునులు చికిత్స పొందుతున్నాడు అయితే అక్కడికి ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్యం కోసం వెళ్లి వచ్చేందుకు 50 వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు తెలిపారు. అందని ప్రభుత్వ సాయం. గత మూడు సంవత్సరాలగా తమ కుమారుడు మంచానికి పరిమితం అయ్యాడు. అటు వైసీపీ ప్రభుత్వంలో, ఇటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వైద్యానికి నిధులు సమకూర్చాలని ఎన్నో మార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అయితే ఒకరు కూడా కరుణించలేదని వాపోయారు. ఇది మా దురదృష్టమని కన్నీరు మున్నీరుగా వినిపించారు. ఇదే విషయంపై ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ పార్టీ కార్యాలయంకు రెండు రోజుల క్రితం బాబుని తీసుకుని వెళ్లామని అయితే పేన్షన్ మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు. దాతల సాయం కోసం ఎదురుచూపు. కూలి చేసుకొని పొట్ట నింపుకునే తమ బ్రతుకులకు విధి వెక్కిరించిందని తల్లిదండ్రులు వాపోయారు కూలి చేస్తేనే కడుపునిండాదని అయితే తమ కుమారుడిని వైద్యం అందించేందుకు అన్ని రకాలుగా అప్పులు చేశామని తెలిపారు. మనసున్న మారాజులు దాతలు కరుణించి కనుకరించి వైద్యం కోసం సాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు ముందుకు వచ్చి 9502254379 కు జంప గాయత్రి కి ఫోన్ పే గాని, యూనియన్ బ్యాంకు సంబంధించిన ఎకౌంట్ నెంబర్ 043910100217023, ఐఎఫ్సి కోడ్ UBIN0804398 దాతలు స్పందించి వైద్యానికి సహకరించాలని గ్రామస్తులు పలురు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.