దివ్యాంగులకు పరోక్షంగా సహకరిస్తున్న అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు

సాక్షి డిజిటల్ న్యూస్, 20 జనవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్: ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అల్లం భాగ్యలక్ష్మిసత్యనారాయణ దంపతులు. దివ్యాంగుల సేవయే విశ్వ మానవ సేవ అని వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్ర నిర్వాహకులు బండపెల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో గల వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రానికి చెందిన దివ్యాంగులను వారి ఇంటి వద్ద నుండి ఉదయం 9 గంటలకు దివ్యాంగుల సెంటర్కు తీసుకువచ్చి, సాయంత్రం 5 గంటలకు తిరిగి వారి ఇంటి వద్ద దిగబెట్టినందుకుగాను ఆటో ప్రయాణ చార్జీలు ప్రతినెల 500 రూపాయలు చెల్లించడానికి వారు ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలలకు కలిపి వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. పసి మనసు కల మా యొక్క బుద్ధిమాంద్యత గల దివ్యాంగుల తరఫున, వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్ర సిబ్బంది తరపున శతకోటి వందనాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.