సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 వేములవాడ. ఆర్. సి. ఇంచార్జ్ సయ్యద్ షబ్బీర్: వేములవాడ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ మార్పు లో కాంగ్రెస్ పార్టీ హయాంలో 19 వార్డు రిజర్వేషన్ మార్పు తో హర్షాలు వ్యక్తం అవుతున్నాయి కొన్ని దశాబ్దాల నుంచి (ఎస్.సి) రిజర్వేషన్ నుంచి (ఓ. సి) మహిళా మారడం సంతోషకరంగా మారింది. పట్టణంలో మారిన రిజర్వేషన్లు ప్రక్రియలో భాగంగా చాలామంది కొత్త వాళ్లకు అవకాశం వచ్చే విధంగా గత 19 వార్డు గత దశాబ్దాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ రావడం తో ఈ సారి (ఓ సి) మహిళా అవకాశం రావడం చర్చనీయంగా మారింది 19 వార్డు లో కూడా ఆశా బావులు ఎక్కువైనారు అధికారం లో కాంగ్రెస్ పార్టీ ఉండడం తో కాంగ్రెస్ పార్టీ వైపు చాలామంది యువత ముగ్గు చూప్తున్నారు అని చెప్పకనే చెప్పక పోవచ్చు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు అబ్దుల్ రజాక్ కు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారని పుకార్లు షికారులై తిరుగుతుంది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శీనన్న కు గత 30 ఏళ్లుగా నమ్మిన బంటుగా ఉంటూ పార్టీ అన్ని కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ ప్రజల సమస్యలు ఎమ్మెల్యే ద్వారా పరిష్కరిస్తూ 19 వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. వేములవాడలో ఆది శ్రీనన్న కు మైనార్టీల లో ముఖ్య అనుచరుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పేరుపొంది ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను ఎమ్మెల్యేకు దృష్టికి తీసుకు వెళ్తూ 19 వార్డు ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాడు.