తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన

* వేములవాడ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 వేములవాడ టౌన్ రిపోర్టర్ అక్కనపల్లి పరుశురాం: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శీనన్న క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) 2026 సంవత్సర క్యాలెండర్ ను నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ముఖ్యమంత్రి ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. టెట్ పరీక్ష గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని సీనియర్లకు పరీక్ష నుండి మిన హింపు ఇప్పిస్తామని ఇచ్చారు త్వరలోనే ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చారు (టిపిటిఎఫ్) జిల్లా అధ్యక్షులు దుమాల రమానాద్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ టీచర్ లకు టెట్ రాయమనడం అసంబద్ధమని, ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఇంప్లీడ్ కావడం కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సీనియర్ లకు టెట్ ను రద్దు చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ తీసుకోవాలని ఆది శీనన్నను కోరడం జరిగింది, అలాగే ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలైనటువంటి పి ఆర్ సి ని వెంటనే ప్రకటించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య మాట్లాడుతూ హెల్త్ కార్డుల కొరకు ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ ఉచితంగా వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెంటనే అన్ని ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందిస్తూ హెల్త్ కార్డులను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని అధికారులు ఆ విషయంలో నిబంధనలు రూపొందిస్తున్నారని, త్వరలోనే అందిస్తామని తెలియజేశారు. టెట్ కు సంబంధించి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అవసరమైతే కోర్టులో కూడా ఇంప్లీడ్ అవుతాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టెట్ లో సీనియర్లను మినహాయించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పిఆర్సి. కి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి మీ అందరికీ తెలిసిందే కాబట్టి కొద్దిగా ఆలస్యం అయినా మంచి పిఆర్సి.ని ప్రకటిస్తామని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ముఖ్యమంత్రి ఉద్యోగులకు పిఆర్సి.ని ఎప్పుడో ఇచ్చేవారని తెలిపారు. ఇంకా వివిధ జిల్లా సమస్యల పైన టిపిటిఎఫ్ బాధ్యులు వారి దృష్టికి తీసుకువచ్చిన అంశాల ను పరిష్కరిస్తామని చెప్పారు.ఏ సమస్య ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారి దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా ప్రభుత్వం తరపున వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, సీనియర్ బాధ్యులు పంజాల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మందాడి శ్రీనివాస్ రెడ్డి, నూగురి దేవేందర్,కెవి రజినీరాణి, జిల్లా కార్యదర్శులు మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, ఎడ్ల కృష్ణ చైతన్య రెడ్డి, బుస రాజేందర్, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ కృష్ణ, నరోత్తం రెడ్డి, పొన్నం శ్రీనివాస్, దూస సంతోష్, సంజీవ్, శ్రీధర్, జగిత్యాల శ్రీనివాస్ శ్రీరామోజు శ్రీనివాస్ రేగుల శ్రీనివాస్. సుల్తాన్ శ్రీనివాస్, చకినాల భాస్కర్, వేణుగోపాలరావు, భూమేష్, రాంప్రసాద్, రమేష్ రెడ్డి, రవీందర్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *