తిమ్మారెడ్డిపల్లిలో నూతన పాలకవర్గ మొదటి గ్రామ సభ విజయవంతం

★ గ్రామాభివృద్ధియే ఎజెండా సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్.

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 20 రిపోర్టర్ తిరుపతి: కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్, గ్రామస్థాయి అధికారులతో కలిసి సోమవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామా భివృద్ధికై ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గ్రామ సభలో సర్పంచ్ గ్రామస్థాయి అధికారులు, గ్రామ ప్రజల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి పలు రకాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అట్టి సమస్యలపై సర్పంచ్ సానుకూలంగా స్పందించి వెంటనే సత్వర పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రేమలత, పంచాయతీ సెక్రెటరీ మల్లారెడ్డి, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ప్రసన్నమని, ఉపాధ్యాయులు, వివిధ శాఖల గ్రామస్థాయి అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.