జోరుగా ఎద్దుల బండ్ల గిరిక పోటీలు

సాక్షి, డిజిటల్ న్యూస్, మరికల్ జనవరి 19,2026, రిపోర్టర్ ఇమామ్: మరికల్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కన్మనూరు రహదారిలో సోమవారం నాడు మరికల్ వికాస సమితి వేదిక ఆధ్వర్యంలో ఎద్దుల బండ్ల గిరిక పోటీలను నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి, మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎద్దుల బండ్ల గిరికా పోటీలను నిర్వహించేందుకు సహకరించిన మరికల్ గ్రామానికి చెందిన రాజమూరు శ్రీనివాసరెడ్డి మొదటి బహుమతి కింద రూ,20 వేల రూపాయలను అందజేయడం జరిగింది, రెండో బహుమతి కింద మరికల్ పట్టణానికి చెందిన ఆదిత్య మెడికల్ షాప్, హాస్పిటల్ యజమాని బొంత సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 15 వేల రూపాయలను అందజేయడం జరిగింది. మూడో బహుమతి కింద మరికల్ గ్రామ 12వ వార్డు సభ్యులు జోగు రామేశ్వరి జోగు మల్లేష్ ఆధ్వర్యం లో రూ పదివేల రూపాయలను అందజేయడం జరిగింది. నాలుగో బహుమతిని మరికల్ గ్రామానికి చెందిన వైదిగుప్త రైతులకు రూ,5000 రూపాయలను బహుమతి కింద అందజేయడం జరిగింది. ఈ ఎద్దుల బండ్ల గిరికల పోటీల కార్యక్రమంలో మరికల్ మండలం లో ని వివిధ గ్రామాలకు నుండి దాదాపు 30 మంది రైతులు ఎడ్లబండ్లతో పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలో దాదాపు చుట్టుపక్కల గ్రామాల రైతులు భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. పోటి పోటీలో పాల్గొన్న రైతులకు సమితి ఆధ్వర్యంలో యూనిఫాంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ ఉపసర్పంచ్ కాజా, వార్డు సభ్యులు, గ్రామ అఖిలపక్ష నాయకులు మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న, పట్టణ హరీష్ కుమార్, కాటేకొండ ఆంజనేయులు, గోవర్ధన్, పి రామకృష్ణ, బొంత మొగు లయ్య, గాజుల కమల్, మాజీ ఎంపీటీసీ సీమ గోపాల్, మాజీ సర్పంచ్ జగదీష్, మాజీ ఉపసర్పంచ్ వీర బసంత్ కుమార్, సురిటి చంద్రశేఖర్, పెంట మీద రాఘవేంద్ర, రామకృష్ణారెడ్డి, మరికల్ ఈ యువకమండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వివిధ గ్రామాల నుంచి హాజరైన రైతులు తదితరులు పాల్గొన్నారు.