జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యుత్ బెల్ అందజేత

సాక్షిడిజిటల్ న్యూస్, రాయికల్, జనవరి 20: తాను విద్యనభ్యసించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టు ఖాళీగా ఉండటంతో బడిగంట మోగించడంలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఉపాధి కల్పన ప్రాంతీయ అధికారి బెజ్జారపు రవీంధ ర్ పాఠశాలకు విద్యుత్ బెల్‌ను అందజేశారు. పాఠశాల సమయసారిణి ఆధారంగా బడిగంట స్వయంచాలకంగా మోగేలా ఈ విద్యుత్ బెల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ తెలిపారు. ఈ చర్యతో బోధనలో సమయ పాలన మెరుగుపడడంతో పాటు సిబ్బందిపై భారం తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పి. రాజశేఖర్, చెరుకు మహేశ్వర శర్మ, పొన్నం రమేశ్, ఎం.డి. రాజమహ్మద్, ఎ. పద్మ, జి. తరంగిణి, ఎ. రజిత, యస్. శోభ తదితరులు పాల్గొన్నారు.