సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 చేర్యాల నియోజకవర్గ ప్రతినిధి మారెళ్ళ లక్ష్మారెడ్డి: సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాణోత్ ఐశ్వర్య 2025 డిసెంబర్ నెలలో కోస్గి లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి, ఎస్ జి ఎఫ్ అండర్-17 విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రిన్సిపాల్ కోట నరేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 19 నుండి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ లో నిర్వహించనున్న జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలలో బాణోత్ ఐశ్వర్య పాల్గొననుందని తెలిపారు. ఈ సందర్భంగా మద్దూర్ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు ఫిజికల్ డైరెక్టర్ దామెర ప్రేమ్ కుమార్ విద్యార్థిని బాణోత్ ఐశ్వర్యను అభినందించి, ఆమె జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.