జాతీయ కబడ్డీ క్రీడాకారిణి గౌతమి నీ ఘనంగా సన్మానించిన బంజారా సంఘం సభ్యులు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్: ఇటీవల హర్యాన రాష్ట్రం సోనీ పత్ జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలో అండర్ 16 ఇయర్స్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో ధర్పల్లి మండలం మద్దుల తండా కు చెందిన గౌతమి జాతీయ కబడ్డీ క్రీడలో పాల్గొని మొదటి బహుమతి సాధించిన సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు మంగిత్య నాయక్ మండల కేంద్రంలోని బంజారా భవన్ లో గౌతమిని వారి కుటుంబ సభ్యులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో క్రీడల్లో మరింతగా రాణించాలని నేషనల్ స్థాయిలో విజయాలు సాధించాలని బంజారా సోదరులు దీవించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బంజారా నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిజాంబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ బోరిగం గంగారెడ్డి జాయింట్ సెక్రెటరీ రాజ్ కుమార్ క్రీడా పోషకులు మైపాల్ రెడ్డి ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సాయిలు ఉపసర్పంచి క్రీడా అభిమానులు తదితరులు అభినందించారు.