సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 జగిత్యాల జిల్లా ఇంచార్జ్ బోనగిరి మల్లారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని జగిత్యాల అభివ్రుద్ది కి నిధులు కోసం కలవగా బి అర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అసత్య ఆరోపణలు చేసి,కార్యకర్తలను రెచ్చగొట్టి నా ఇల్లు,హాస్పిటల్ పై దాడి చేయించారు పూర్వకంగా నాపై జిల్లా అధ్యక్షునిగా కనీసం నా వివరణ కూడా కోరలేదు.ఉద్దేశ పూర్వకంగా నాపై ఆరోపణలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ వారి ఇంటి పార్టీ అయినట్టు ఇష్టా రీతిన మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తో కలసి జగిత్యాల అభివృద్ధి కోసం పని చేస్తున్నా జగిత్యాల అభివ్రుద్ది నీ ప్రజలు గమనిస్తున్నారు.ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా ప్రజలు గమనిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డబల్ బెడ్ రూం ఇండ్ల పరిస్థితి ప్రశ్నార్థకం గా మారింది.ముఖ్యమంత్రి కలిశాకనే 34 కోట్లు మంజూరు అయ్యాయి. జగిత్యాల రాయికల్ పట్టణం లో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యదిక నిధులు జగిత్యాలకు వచ్చాయి. నరికేస్తా చంపేస్తా అంటే అది రాజ్యాంగమా ప్రజలు అభివ్రుద్ది కోరుకుంటారు. హత్య రాజకీయాలు కాదు రాజ్యాంగం లో ఏ ఆర్టికల్ లో కూడా నరికేస్తా అనే పదం లేదు సీనియర్ నాయకులు గా ఉండి హింసను ప్రోత్సహించరాదు ప్రజలకు కార్యకర్తలకు ఆదర్శంగా నిలవాలి. ప్రెస్ మీట్ పెట్టుడు కాదు పనులు కావాలి. బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు 1996 లో ఇండిపెండెంట్, తర్వాత అర్ టి సి జోనల్, జడ్పీటీసీ గా టీడీపీ నుండి పని చేశారు. అప్పుడు ఏండ్లు జెండా మోశారు అని అన్నారు. కోరుట్ల కు ఇంజనీరింగ్ కాలేజీ వస్తె హైదరాబాద్ కు తరలించారు. నడుమంత్రపు సిరి తో అహం తో మాట్లాడడం పనికిరాదు. ముత్యం పెట్ షుగర్ ఫ్యాక్టరీ మీ హయం లో అమ్మారు ఇప్పుడు అది కూడా మూత పడింది. కాంట్రాక్టర్ గా పని చేశారు. కదా డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోరుట్ల లో ఎందుకు చేపట్టలేదు. ఇంజనీరింగ్ కాలేజీ లు ఫాం హౌస్ లు మాత్రం నిర్మించుకున్నారు. ఉద్యమ సమయంలో టి ఆర్ ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి ఓటు వేస్తే కేసీఆర్ సస్పెండ్ చేసిన చరిత్ర అందరికీ తెలుసు.విమర్శించే ముందు నీ తప్పులు తెలుసుకో సీనియర్ కాంగ్రెస్ నాయకుని హయం లో నూకపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల కు 2009 నుండి 14 వరకు స్థల సేకరణ, నిర్మాణం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎందుకు ఇండ్ల నిర్మాణం సీనియర్ నాయకులు పూర్తి చేయలేదు సీనియర్ నాయకులు ఎన్ని నెలలు జెండా మోస్తే టీడీపీ టికెట్ వచ్చింది. ఎన్ టి ఆర్ కి వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ కు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాతా కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారూ అప్పుడు మీరు పార్టీ పురాయించ లేదా రాష్ట్రం లో పార్టీ గెలుపు కోసం గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. 2014 మున్సిపల్ లో టీడీపీ జెండా మోసిన వారికి, ఎన్నికల్లో అప్పుడే వచ్చిన వారికి కాంగ్రెస్ టికెట్ ఎలా ఇచ్చారు. కే సి ఆర్ ఇతర పార్టీ ల నుండి ఎమ్మెల్యేలను చేర్చుకున్నపుడు ఎమ్మెల్యే గా ఉండి సీనియర్ నాయకులు ఒక్కసారైనా ప్రశ్నించారా. ఇప్పుడు ఎందుకు లీడర్ ఆఫ్ ది హౌస్ క్యాబినెట్ హోదా భట్టి కి రాలేదు అనాడు ఎందుకు ప్రశ్నించలేదు. నేను ప్రభుత్వం తో కలిసి పని చేయటం పై చట్టానికి జవాబు ఇస్తా. సీనియర్ నాయకులకు ప్రశ్నించే హక్కు ఏ మాత్రం లేదు నాది స్పీకర్ పరిధిలో ఉంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వారికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు. మీడియా సమావేశంలో పాల్గొన్నవారు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ ఏఎంసీ చైర్మన్ కోలుగురీ దామోదర్ రావు సీనియర్ నాయకులు గట్టు సతీష్ అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ అడువల లక్ష్మణ్, దుమాలరాజ్ కుమార్, శ్రీనివాస్ తిరుమలయ్య, కూసరి అనిల్, తోట మల్లికార్జున్, పద్మావతి పవన్, బద్దం లత, వద్ధి శ్రీలత, గుర్రం రాము, పంబల రాము, బోడ్ల జగదీష్, బిక్షపతి, రంగు మహేష్, కోరే గంగమల్లు, ఫుర్ఖాన్, ఫారూఖ్, శరత్ రావు, అహమ్మద్, జావేద్ నరేందర్ మతీన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.