జగద్గురు ఖాదర్ లింగస్వామి మరియు ఉరుకుంద ఈరన్న స్వామి దర్శించుకున్న

* ఎమ్మెల్యే కె యి శ్యాంబాబు టిడిపి జిల్లా మాజీ అధ్యక్షులు తిక్క రెడ్డి.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20-26 కర్నూలు జిల్లా కౌతాళం మండళం రిపోర్టర్ ఖాదర్ భాష: కౌతళం మండలం ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి (ఈరన్న స్వామి)ని దర్శించుకున్న ఎమ్మెల్యే కే యి శ్యాంబాబు మరియు కర్నూలు జిల్లా టిడిపి మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి దర్శించుకున్నారు. అమావాస్య పర్వదినం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కే యి శ్యాంబాబు పాలకుర్తి తిక్కరెడ్డి ఆలయ అధికారులు పూజరులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పూలమాలతో సన్మానించి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. అమావాస్య పర్వదినం సందర్భంగా కౌతాళంలో వెలసిన శ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామిని ఎమ్మెల్యే కె యి శ్యాంబాబు టిడిపి జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి వారికి స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకె యి శ్యాంబాబు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ బాబు రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉండాలని అందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మాజీ చైర్మన్ చన బసప్ప దని కూట్రేష్ గౌడ్ సతీష్ రమేష్ గౌడ్ వెంకటరెడ్డి కురుగోడు సిద్దు చౌదరి సోమశేఖర్ సుబ్రహ్మణ్యం రాజు అబ్దుల్ రెహమాన్ మంజునాథ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *