సాక్షి డిజిటల్ న్యూస్ జిల్లా వనపర్తి మండలం చిన్నంబావి రిపోర్టర్ క్రాంతి కుమార్: తెలంగాణo న్యూస్ జనవరి 19 చిన్నంబాయి మండలం వాల్మీకి చౌరస్తాలో ఈరోజు ఎస్సై నాగరాజు వారి సిబ్బందితో కలిసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా పలువురు సర్పంచులు ఉపసర్పంచులు వార్డు నెంబర్లు సమక్షంలో పాల్గొన్నారు. ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ సమాజంలో మనము ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు బైక్ పైన రక్షణగా తలకు ఎలిమెంట్ ధరించి రోడ్డు ప్రయాణం చేయాలని ప్రజలకు తెలియజేశారు, అలాగే మనం గమ్యం క్షేమంగా చేరాలంటే ఎలిమెంట్ తప్పనిసరిగా అని చెబుతూ మన కొరకు మన ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు, కాబట్టి మనం మన కుటుంబ సభ్యులను క్షేమంగా చూసుకోవాలంటే మనం తలకు హెల్మెట్ ధరించి ప్రయాణించాలనేవి తెలియజేశారు, అలాగే కారు ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని తెలియజేశారు, మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు అంటూ ప్రజలకు తెలియజేశారు. మైనర్లకు పిల్లలకు బైకులు ఇస్తే బైకు యజమానిపై కేసు నమోదు చేయబడుతుంది అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిన్నంబావి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ కొప్పునూరు ఉపసర్పంచ్ సుదర్శన్ రెడ్డి పెద్దదగడ గ్రామ సర్పంచ్ భాస్కర్ యాదవ్ మరియు వెంకటేష్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని
ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.