సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం: చినపాచిల గ్రామంలో గౌరీ పరమేశ్వరుల అనుపోత్సవం ( గైరమ్మ సంబరాలు) సోమవారం ఘనంగా జరిగాయి. కార్తీక మాసం ప్రారంభం అయిన నాటి నుంచి గ్రామంలో గౌరీ పరమేశ్వరులను ఏటా నెలకొల్పుతుంటారు. ఈ ఏడాది కూడా సర్పంచ్ కోమటి శంకర్రావు దంపతుల ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరులను నెలకొల్పి సుమారు రెండు నెలలపాటు ఘనంగా పూజలు నిర్వహించారు. సోమవారం అనుపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి ఒక్కో రకం స్వీట్ చొప్పున వందలాదిమంది ఘనంగా సారె సమర్పించారు. పలు రకాల నేలవేషాలు, డప్పుల వాయిద్యాలతో సంబరం ఘనంగా జరిగింది. సోమవారం రాత్రి గ్రామంలో గ్రామస్తుల వినోదార్థం పలు సాంస్కృతి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు..శేషు రావికమతం.