సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 గూడూరు రిపోర్టర్ చెన్నూరు మస్తాన్: తెలుగు భాషా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా యోగి వేమన 374వ జయంతి వేడుకలను చిల్లకూరు మండలం పాలిచర్ల వారి పాలెం ఉన్నత పాఠశాలలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష నిర్వాహకులు, తెలుగు ఉపాధ్యాయులు ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజా కవి, తత్వవేత్త, సత్యవాదిగా సమాజంలోని కుళ్ళును, మనుషుల వేషధారణలోని మోసాన్ని గమనించిన వేమన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తన పద్యాలను ఆయుధంగా వాడి, సమాజంలో మూఢనమ్మకాలు, కుల వివక్షత పై తీవ్ర విమర్శ చేసి' విశ్వదాభిరామ వినురవేమ, " అనే మకుటంతో ప్రజలకు సత్యమార్గాన్ని చూపించిన కర్మయోగి వేమన అని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనసూయ మాట్లాడుతూ వేమన జయంతి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులందరికి, వేమన పద్యాల పై పోటీ, వ్యాసరచన, ప్రజా కవి వేమన అనే అంశంపై మాట్లాడడం, చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగభూషణమ్మ, చంద్రశేఖర్, మాధవయ్య, లావణ్య, సంధ్య, శ్రీనివాసులు, రవీంద్ర, లీల, సుగుణ, కామేశ్వరి, విద్యుల్లత, డివి రమణయ్య, మధుసూదన్ రావు, మధు, తదితరులు పాల్గొన్నారు.