సాక్షి డిజిటల్ న్యూస్, 20 జనవరి, మహాదేవపూర్ తులసి మహేష్: జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలకు అతీతంగా మంచి-చెడుల న్యాయ నిర్ణేత సర్పంచేనని అన్నారు. వార్డులలో ఓటు వేసిన వారిని ఓటు వేయని వారిని ప్రభుత్వ పథకాల్లో సమాన స్థాయిలో చూడాలన్నారు. కుల, మత, జాతి రాగద్వేశాలు ఉండొద్దు అని,బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, కుల నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలనలో సర్పంచ్ లదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని, రోడ్డు నిర్మాణాలు ఇతర గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ పడాలన్నారు. గ్రామాల్లో ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులమీద కావని స్వతంత్రంగా గుర్తులు కేటాయిపు ద్వారా జరగడం గ్రామాల్లో రాజకీయాలు, గ్రూప్ తగాదాలు లేకుండా చూడడమే అన్నారు. చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు.