గణతంత్ర దినోత్సవ వేడుకలలో అంబేద్కర్ చిత్రపటం తప్పనిసరి

★ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) భాస్కరరావుకు వినతి పత్రం అందజేత.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి: ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల యాదగిరి, వలిగొండ మండల అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) భాస్కరరావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుండి జిల్లా వరకు గవర్నమెంట్ ఆఫీసులలో, ప్రైవేట్ ఆఫీసులలో, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో అంబేద్కర్ చిత్రపటం ఉండేలా సూచించాలని అడిషనల్ కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాశమల్ల శేఖర్, సహాయ కార్యదర్శి కట్ట సురేష్, సంస్కృతిక కార్యదర్శి కూచిమల్ల కుమార్, వెలువర్తి గ్రామ అధ్యక్షులు కూచిమల్ల నాగేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు వలమల్ల రత్నయ్య, జక్క స్వామి, మద్దెల వెంకటేశం, బెల్లపు కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.