కేసీఆర్ తోనే తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధి

★ గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ★ నాలుగో వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్ నాయక్.

సాక్షి డిజిటల్ న్యూస్ మెదక్ జిల్లా జనవరి 20 ప్రతినిధి: తూప్రాన్ మున్సిపాలిటీ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలొనే అభివృద్ధి జరిగిందని గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీ లోని వార్డులలో బిఆరెస్ పార్టీ జెండాలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పది సంవత్సరాల పాలనలోనే గ్రామ పంచాయతీ గా ఉన్న తూప్రాన్ ను మున్సిపాలిటీ గా చేసి ప్రత్యేక నిధులను ఇచ్చి తూప్రాన్ ను అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ ఇంచార్జి వేణుగోపాల్ రెడ్డి, సతీష్ చారి, సీనియర్ నాయకులు శలాక రాజేశ్వర శర్మ, బాబుల్ రెడ్డి, వార్డు ఇంచార్జ్ లు శివగౌని శ్రీనివాస్ గౌడ్, కల్లూరి హరికృష్ణ, పొట్టోళ్ల వెంకట్ గౌడ్, మన్నే శ్రీనివాస్, బాయికాడి అంజి, మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు దుర్గరెడ్డి, రఘుపతి, కమ్మరి శ్రీధర్ చారి, కొక్కొండ కాశీ రెడ్డి, జైపాల్ నాయక్, బండ నాగరాజు, మామిండ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.