ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పై దాడులు

* మాధవరం గ్రామంలో బీఆర్ఎస్ వార్డు మెంబర్ గడ్డివాము దగ్దం. * దగ్ధమైన గడ్డివామును పరిశీలించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్: మునగాల మండలం మాధవరం గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మున్నా లింగయ్య పోటీ చేసి ఘన విజయం సాధించడంతో పాటు, గ్రామ సర్పంచ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటీవల లింగయ్య తమ పశువుల కోసం సేకరించుకున్న గడ్డివామును ప్రత్యర్థులు రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసి దగ్ధం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన దగ్ధమైన గడ్డివామును నేడు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, నియోజకవర్గoలోని మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో జీర్ణించుకోలేని ప్రత్యర్థులు అప్పటి నుంచి గ్రామాలలో పలు రకాల కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ దిమ్మలు పగులకొట్టడం, శ్రేణులపై వ్యక్తిగత దాడులు చేయడం, కార్యకర్తలకు ఆస్తి నష్టం చేయడం వంటి అనేకంగా జరుగుతున్నాయని ఇదంతా స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రోత్సాహంతోనే అయితున్నాయని దీనికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఈ ఘటనలలో ఇప్పటివరకు స్థానిక పోలీసులు నిందితులను గుర్తించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. పోలీసులు తమ విచారణలో జాప్యం చేయడం చూస్తుంటే, అధికార పార్టీ నాయకులకు స్థానిక పోలీసులు ఎలా వత్తాసు పలుకుతున్నారో స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అరాచకాలను ప్రోత్సహిస్తూ పోలీసులకు అండగా నిలుస్తున్నారని, అందువల్లే ఇటువంటి దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. నిందితులను గుర్తించినప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి, గడ్డివాము దగ్ధానికి కారణమైన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *