సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 20 ఆత్మకూర్ (ఎం) మండల రిపోర్టర్ మేడి స్వామి: పోతిరెడ్డిపల్లి గ్రామ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ ఉప సర్పంచ్ మెట్టు లలిత వార్డు మెంబర్లు ఇంద్రాల అంజయ్య మక్తల మంగమ్మ ఇంద్రాల రేణుక ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై మరియు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది దానిలో ప్రధానంగా బిక్కీరు వాగుపై హై లెవల్ వంతెన నిర్మాణం పారుపల్లి ఎక్స్ రోడ్డు వయా పోతిరెడ్డిపల్లి నుండి రహీంఖాన్ పేట వరకు బిటి రోడ్డు నిర్మాణము గురించి మరియు గ్రామపంచాయతీ నూతన భవనం గురించి బీసీ కమ్యూనిటీ భవనము సిసి రోడ్ల నిర్మాణము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు ఎమ్మెల్యేకి తెలిపారు వీటిపై అనుకూలంగా స్పందించి ఈ త్వరలో పరిష్కరిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడమ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు నాగుల ఆనంద్ యాదవ్ జక్కు మల్లారెడ్డి మెట్టు అంతిరెడ్డి మంచోజు అమరేంద్ర చారి కడకంచి కుమార్ తదితరులు పాల్గొన్నారు.