ఊడుగులమ్మవారిని దర్శించుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20.1.2026 సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి చిర్రా నాగరాజు ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో వేంచేసియున్న గ్రామ దేవత శ్రీ ఊడుగులమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆలయ కమిటీ పెద్దలు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జాతర, తీర్థ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టమన్నారు. అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన గ్రామస్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.