ఉపాధ్యాయ కుటుంబానికి పి ఆర్ టి యు సంఘం లక్ష రూపాయల ఆర్థిక స సహాయం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 భూమయ్య పిట్లం మండలం: పిట్లం మండలంలోని ఎంపీపీస్ చిన్న కోడపగల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ వారం క్రితం అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయురాలు p.కాశమని కుటుంబానికి పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం ఒక లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందజేస్తూ భరోసా కల్పించింది. కాశమని పి ఆర్ టి యు సంఘంలో క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉండటంతో, సంఘం నిబంధనల ప్రకారం ₹1,00,000/- (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని మాజీ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ , జిల్లా అధ్యక్షులు కుశాల్ ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి , పిట్లం మండల శాఖ అధ్యక్షులు పి బన్సీలాల్, ప్రధాన కార్యదర్శి సి నారాయణ చేతుల మీదుగా‌కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుశాల్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉపాధ్యాయులకు ఎదురయ్యే అనూహ్య పరిస్థితులలో పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం సభ్యులకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఉపాధ్యాయ కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీ బన్సిలాల్,మండల ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ, అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బాధ్యులు పాల్గొని మృతురాలి సేవలను స్మరించి కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *