సాక్షి డిజిటల్ న్యూస్ :20 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు రాము: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఈనెల 19 నుండి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ పశు ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, పశువులకు వచ్చే పలు వ్యాధులకు మందులు మరియు టీకాల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంపై గోడ పత్రికను మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పశువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చని తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఈనెల 19 నుండి 31 వరకు పశువులకు దూడలకు మరియు సన్న జీవాలకు నట్టల నివారణ మందులు ఉచితంగా త్రాపించబడతాయని, గొర్రెలు మేకలకు ఉచితంగా బొబ్బ వ్యాధి చీడపారుడు, చిటుక, నీలి నాలుక, వంటి వ్యాధులకు వ్యాధి టీకాలు ఉచితంగా అందించడం జరుగుతుందని వ్యాధులకు టీకాలు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ టీకాలను మరియు మందులను రైతులందరూ వినియోగించుకొని పశువులకు వచ్చే వ్యాధులు నివారించుకోవచ్చని సూచించారు. శాస్త్రీయ పశు యాజమాన్య పద్ధతులు మరియు పశువిజ్ఞానం పై అవగాహన సదస్సులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. గోకులాలు వాటి నిర్మాణం పై అవగాహన కల్పించడం జరుగుతుందని, సంచార పశు ఆరోగ్య సేవ కేంద్రాలు నిర్వహించబడతాయని, పశు బీమా పథకం అమలు పశు కిసాన్ క్రెడిట్ కార్డు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. రైతులందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదనరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై, ఆ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.