ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ భానుక నర్మద

సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 20 - సికింద్రాబాద్ కంటోన్మెంట్-నటరాజ్ గౌడ్ రిపోర్టర్: ఇందిరా మహిళా శక్తి పధకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గం లోని 590 మహిళా సంఘాల గ్రూపులకు 1 కోటి 74 లక్షల 43 వేల 938 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం మెప్మా అధికారులు మారేడ్ పల్లి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ స్థానిక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలసి పాల్గొనటం జరిగింది. మెప్మా అధికారులతో కలిసి మహిళా సోదరీమణులకు చెక్కులను పంపిణీ చేశారు .చెక్కుల పంపిణీ అనంతరం బానుక నర్మద మాట్లాడుతూ మాట్లాడుతూ మహిళలను శక్తి మంతులను చేయడమే కాకుండా వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లపుడూ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మొదటగా పావులా వడ్డీ పథకం మన కంటోన్మెంట్ లో అమలు కాకపోతే 2009 సంవత్సరం లో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ని కలసి తమ ప్రాంత ప్రజలకు కూడా ఈ పథకం అమలు చేయాలని అప్పటి బోర్డ్ సభ్యులతో కలసి వారిని కోరడం జరిగింది, కోరిన విధంగానే వారి వెంటనే ఈ పథకాన్ని మన కంటోన్మెంట్ మహిళ సంఘాలకు రూపాయలు 50 వేల తో మొదలై ఈరోజు రూపాయలు 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందజేయడం జరుగుతుంది. ఇలాగే భవిష్యత్తులో కూడా మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మెప్మా అధికారులు ప్రకాష్, నరసింహ మరియు తదితరులు పాల్గొన్నారు.