ఇందిరా మహిళా శక్తి జన్నారం మండలంలో అన్ని గ్రామాల్లో చీరల పంపిణీ

★ ప్రతి నెల 2500 రూపాయల పథకం మహాలక్ష్మి కోసం ఎదురుచూపు.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్: జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీ లతో పాటు అనేక అనుబంధ గ్రామాలలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ పరంగా సారే బహుమతి ఇందిరమ్మ మహిళా శక్తి చీరే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చీరతో పాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా 2500 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అందించాలని మహిళా మణులు ఆకాంక్షిస్తున్నారు. ఆరు పథకాల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ ఇందిరమ్మ చీరలు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నప్పటికీ దీపం పథకంలో గ్యాస్ సిలిండర్ హామీ నెరవేరడం లేదు అని మహిళలు తెలిపారు. ఒక కోటి మందికి చీరలు పంచడం కోసం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రతి ఇంటికి పదో తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు వైఫై తో పాటు ల్యాప్టాప్ ను అందించాల్సిన అవసరం ఉంది మహిళలకు స్కూటీ పథకాన్ని కూడా నెరవేర్చాలని కోరారు. వార్త ముగింపు.