సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 భూమయ్య మండలం పిట్లం: బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తూ వారి గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. మహిళల సంక్షేమం, సాధికారతే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ పేదల అభ్యున్నతికోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, పార్టీ మండల అధ్యక్షులు, స్థానిక మండల నాయకులు, మహిళా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.