సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 20/2026 ఖమ్మం జిల్లా వైరా: చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు ఐద్వా జాతీయ మహాసభ సందర్భంగా జనవరి 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు ఇంటికో మహిళా ఊరికో బండితో కదిలి రావాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, డివిజన్ నాయకురాలు మచ్చా మణి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆకాంక్షిస్తూ ఐద్వా వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య నగర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జెండాను ఐద్వా సీనియర్ నాయకురాలు పెద్దమళ్ళ పద్మ తిలకం ఎగురవేశారు. ఐద్వా జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో గుడిమెట్ల రజిత, మచ్చా మణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మొదటిసారి జనవరి 25 నుంచి 28 వరకు ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 25న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి మహిళలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. మహిళల హక్కులు, విద్య, భద్రత, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తదితర మహిళల అనేక సమస్యలపై ఐద్వా సమరశీల పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని, మహిళలు, యువతులపై వేధింపులు, హత్యలు, లైంగిక దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా జాతీయ మహాసభకు జాతీయ నాయకులు బృందాకారత్, అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి టీచర్, మరియం దావలె, జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి, సుధా సుందర రామన్ హాజరవుతారని, మహిళలు భారీగా హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ నాయకులు తోట కృష్ణవేణి, బాణాల వెంకట్రావమ్మ, భూక్యా విజయ, చావా కళావతి, మాదినేని రజిని, తాటి కృష్ణకుమారి, తోట పద్మావతి, దేవబత్తిని లక్ష్మితులసి, లైన్స్ క్లబ్ సభ్యురాలు మాదినేని సునిత, కోటేరు మాధవి, ఎనమద్ది సక్కుబాయి, మాయా సింగ్, గుండ్ల కళ్యాణి, నక్క పద్మజ, మాదినేని పద్మ, కుదురుపాక నాగమణి, ఇమ్మడి శైలజ, పొనుగుమాటి అఖిల, మౌనిక, రోజా, భావన, సాహితి, నాళ్ల మాధవి, రత్నకుమారి, విజయ, కుమారి, మహేశ్వరి, వసంత తదితరులు పాల్గొన్నారు.