సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా: మండలంలోని 89 పెద్దూరు గ్రామం నుండి ఆంబూరుకు వెళ్లే రోడ్డు అభివృద్ధికి రాజకీయ నాయకుల హడావుడికి వేదికగా మారింది 89 పెద్దూరు గ్రామం నుండి తమిళనాడులోని ఆంబూరు గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేస్తే రామకుప్పం మండలం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని నిపుణుల అభిప్రాయం ఆంబుర్ నుండి రామకుప్పం మీదుగా బెంగళూరుకు మార్గం ఏర్పడి వ్యాపార కార్యకలాపాలు తోపాటు వివిధ రంగాల్లో అభివృద్ధికి సాధ్యమవుతుంది ఈ నేపథ్యంలో దశాబ్దక్రితం అటువి మార్గంలోనున్న ఆంబురుకు రోడ్డు ఏర్పాటుకు అప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు తమిళనాడులోని ఆర్కాట్ జిల్లా కలెక్టర్ తో సంప్రదింపులు సైతం జరిపారు ఎందుకు కావలసిన నిధులు సైతం తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది పనులు ప్రాథమిక దశలో చేపట్టగా 2019 నా వైకాపా పార్టీ అధికారంలోకి రావడంతో ఆంబూరు రోడ్డు నిర్మాణం కనుమరుగైంది అనంతరం వైకాపా నేతలు ఆంబూర్ రోడ్డు అభివృద్ధి చేస్తామని పోటాపోటీగా పర్యటించారు. అనంతరం నిధులు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సకాలంలో పనులు చేపట్టకపోవడంతో కనుమరుగైంది మళ్లీ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాక ఆంబు రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆదివారం మండల స్థాయి అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మందత్ములు తదితరులు ఆమ్బుర్ రోడ్డును పరిశీలించారు. రోడ్డు అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఏమైనా ఆంబూర్ రోడ్డు రాజకీయ పార్టీలకు వేదిక కాకుండా పనులు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరించాలని చెప్పవచ్చు ముఖ్యంగా అట్వీ పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలకు తమిళనాడు వెళ్లేందుకు రోడ్డు మార్గం సులుభం కాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని చెప్పవచ్చు.