సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 2026 రిపోర్టర్ రాజు గద్వాల జిల్లా: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల టౌన్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారికి అర్హులైన ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా 147 మందికి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందించడం జరిగింది. తర్వాతనే జరిగే మున్సిపల్ ఎన్నికలలోతమ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారు కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచి నప్పటి నుండి మీ ప్రాంతంలోని ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేయడం జరిగింది.