అన్నపూర్ణ మహా ప్రసాదం ట్రస్ట్ అధ్వర్యంలో

★ మహా ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న భారత్ సురక్ష సమితి నాయకులు.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బైరాన్ నారాయణ గొల్లపల్లి 20 జనవరి 2026: అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులు మురికి రమణ, చకిణం ప్రసాద్ మరియు సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున మహా ప్రసాదం నిర్వహిస్తున్నారు. ఈ రోజు స్థానిక విద్యానగర్ రామాలయంలో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ అమవాస్య రోజు పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేని నిరు పేదలను భగవంతునిగా భావించి చేసే మహత్కార్యం ఇదని, అన్నదానం జరిగే చోటకు భగవంతుడు పేదవారి రూపం దాల్చి వస్తాడని పురాణాలు చెపుతాయని అన్నారు.గత కొన్ని నెలలుగా ప్రతి అమవాస్య రోజు పేదలకు చేసే అన్నదానంతో ఎంతో పుణ్యం, ఆత్మసంతృప్తి కలుగుతుందని ఆయన అన్నారు. అన్ని దానాలకెల్ల అన్నదానం గొప్పదని, ప్రతి ఇదేస్పర్తితో ఏదో ఒక రూపంలో దానాలను చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు, మాజీ కౌన్సిలర్ ఆరవ లక్ష్మి , అక్కినపెళ్ళి కాశీ నాదం, కొక్కుల ఆంజనేయులు, కొత్తకొండ బలన్న, పన్నటి విఠల్, నారెందుల శ్రీనివాస్, తౌతు రామచంద్రం, శ్రీనివాస్, రమేష్ తదితరలు పాల్గొన్నారు.