సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు: అమలాపురం నియోజకవర్గ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 49 వేలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విలస- కొప్పిశెట్టి వారి పాలెం కు చెందిన రాయుడు శ్రీనువాస్ గత కొంతకాలంగా కిడ్నీ, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. తన ఆర్థిక, అనారోగ్య స్థితిని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని శ్రీనువాస్ కి రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే అమలాపురం రూరల్ మండలం వేమవరపు పాడుకు చెందిన రాయుడు పెదబాబు పుట్టుకతో దివ్యాంగుడు. ఏ పని చేయలేని నిస్సహాయ స్థితి. అయన దయనీయ పరిస్థితిని చూసి చలించిన మంత్రి సుభాష్ స్థానిక ఎస్ ఏ ఎఫ్ నాయకులతో కలిసి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందించారు. మంత్రి సుభాష్ తో పాటు ఎస్ ఏ ఎఫ్ నాయకులు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడం పట్ల మంత్రి సుభాష్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చినబాబు, ఉప్పలగుప్తం మండలం ఎస్ఏఎఫ్ అధ్యక్షులు విత్తనాల సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి గుత్తుల నాగేశ్వరరావు, బొంతు మోహనరావు, రాయుడు సత్య ఋషి, అనిశెట్టి శ్రీనివాస్, అప్పారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.