అథ్లెటిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన అచ్చంపేట ఎంఎస్ఎన్ స్కూల్ విద్యార్థి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 అచ్చంపేట రిపోర్టర్ కొమ్ము రేణయ్య: అచ్చంపేట పట్టణంలోని ఎంఎస్ఎన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి శివ రామకృష్ణ ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన 11 వ తెలంగాణ అథ్లెటిక్స్ మీట్ అండర్ 12వ లాంగ్ జంప్ విభాగంలో బంగారు పతకం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ పథకం సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చిన శివ రామక్రిష్ణ ను మరియు వ్యాయామ ఉపాధ్యాయులు రాజెందర్ ను పాఠశాల యాజమాన్యం మరియు ఉపాద్యాయులు అభినందించారు. శివ రామక్రిష్ణ మరింత కృషితో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇంచార్జీ నరెందర్, ప్రిన్సిపాల్ వెంకటయ్య, పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జీ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *