అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలో పాల్గొనడానికి 20,000/- స్పాన్సర్ చేసిన

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20/2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్: బోడుప్పల్ సర్కిల్ జిహెచ్ఎంసి 12 వ డివిజన్ చెంగిచెర్ల బిజెపి ఉపాధ్యక్షుడు చెంగిచెర్ల క్రాంతి నగర్ కాలనీకి చెందిన ఇప్పకాయల రాము సంధ్య గల ఇద్దరూ పిల్లలు ఇద్దరు ఇండియా తరుపున సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అని కొనియాడారు. పెద్ద అబ్బాయి ఇప్పకాయల విశ్వంక్ తేజ్, చిన్నబ్బాయి ఇషాన్ తేజ్ ఇద్దరు పిల్లలు టీం ఇండియా లో స్థానం దక్కించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. గండిపల్లి రాజు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలో పాల్గొనడానికి మన చెంగిచెర్ల, తెలంగాణ, భారతదేశం నుండి వెళ్ళడం చాలా గర్వంగా ఉంది అని చెప్పారు ఇప్పకాయల విశ్వంక్ తేజ్ ఇప్పకాయల ఇషాన్ తేజ్ క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 1,చెంగిచెర్ల, మేడ్చల్ మల్కాజ్గిరి వాస్తవ్యులు వీరికి మూడు జాతీయ పతకాలు, రాష్ట్ర స్థాయిలో మరియు డిస్ట్రిక్ స్థాయిలో అనేక పతకాలు వచ్చాయి ఈ నెలలో 23, 24th జనవరి 2026 నేపాల్ లో జరిగే అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలో పాల్గొనే దేశాలు, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్ మరియు నేపాల్ వేదికగా జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ ప్రపంచ మెడల్ 2026 టైటిల్ సాధించేందుకు, ఆటలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి ఇండియాకు తెలంగాణాకు అదేవిధంగా మన చెంగిచర్లకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, విజయం సాధించి మొదటి ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవాలని భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటాలని పిల్లలకు గండిపల్లి రాజు జిహెచ్ఎంసి 12 వ డివిజన్ చెంగిచెర్ల బిజెపి ఉపాధ్యక్షుడు ఆశీర్వాదాలు అందించి, శాలువాలతో పిల్లలను సత్కరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *