23 వ వార్డు కౌన్సిలర్ రేసులో కండెం వంశికృష్ణ..

★ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా. ★ప్రజా సేవ చేయడానికి వస్తున్న జర్నలిస్ట్ వంశీకృష్ణ. ★ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా విజయం సాధిస్తా సేవకుడిగా అందుబాటులో ఉంటా.

సాక్షి డిజిటల్ న్యూస్ 19 జనవరి 26 జమ్మికుంట టౌన్ రిపోర్టర్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట పట్టణంలోని 23వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని వార్డు ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే వార్డు రూపురేఖలు మార్చి అభివృద్ధి చేస్తానని వైశ్య బిడ్డ కండెం వంశీ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే నిస్వార్ధంగా సేవ చేస్తూ నాయకుడిగా కాకుండా సేవకుడి గా పని చేస్తానని వంశీ తెలిపారు. ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై అవగాహన ఉందని 23వ వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 23వ వార్డు జనరల్ బరిలో ఉంటానని ప్రజలు ఆశీర్వదించి ఆచరించాలని ఆయన కోరారు. పైసలకు ప్రలోభాలకు లొంగకుండా నాయకుడిగా సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజాసేవ చేయడంలోనే పూర్తి సమయం కేటాయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.