సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 కౌతాళం కౌతాళం మండల కేంద్రమైన కౌతాళంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చూడి ఉలిగయ్య తెలుగు ప్రజలు ఆత్మ గౌరవం కోసం బడుగు బలహీన వర్గాల కోసం పని చేసి బడుగు బలహీన వర్గాల మనసు గెలిచిన ఏకైక నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చూడి ఉలిగయ్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా కౌతాళం లో యన్ టి ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంకటపతి రాజు టీబీ డ్యాం అధ్యక్షులు టిప్పు సుల్తాన్ కౌతాళం టౌన్ అధ్యక్షులు రాజానంద్ తెలుగుదేశం యువ నాయకులు సతీష్ నాయుడు సుభాన్ గిరి సౌడ్రి బసవ నాగరాజ్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
