సాక్షి డిజిటల్ న్యూస్ - జనవరి 19- సికింద్రాబాద్- మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ. అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు.. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సాధన కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీకి పిలునిచ్చిన నేపథ్యంలో ర్యాలీకి అనుమంతించ కుండా ఉదయం నుండే పోలీసులు ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారు.
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం శాంతి ర్యాలీని అడ్డుకుంటుంది రెట్టించిన ఉత్సాహంతో పోరాటాన్ని కొనసాగిస్తాం. మా ప్రాణాలు అయినా పణంగా పెట్టి సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ సాధిస్తాం అనే నినాదాలతో హోరెత్తించిన మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్. ఈ కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు