వాయిలసింగవరం గ్రామంలో ఘనంగా యన్టీఆర్ 30వవర్ధంతి కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, అనంతగిరి మండలం వాయిలసింగవరం గ్రామంలోఈరోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సంధర్భంగా గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వర్గీయ యన్టీఆర్ చేసినసేవలను కొనియాడారు.. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా, పింఛన్లు, పక్కా ఇళ్ళ నిర్మాణం, రైతులకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన,ఆడబిడ్డలకు ఆస్థిలో హక్కు,త్రాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పధకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు అని ఆయనకొనియాడారు. ఇట్టి వర్ధంతి కార్యక్రమంలో యన్టీఆర్ అభిమానులు మాజీ పిఏసీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు గద్దె రఘు గద్దె వెంకటేశ్వరరావు, కొల్లు సుబ్బారావు,చుండూరు మురళి, గుండ్లపల్లి వెంకన్న, కంటు వేణు, దాములూరి మురళి, బొర్ర నవీన్, బొర్రయశ్వంత్, బుర్రా నాగమల్లేశ్వరరావు, హనుమంతు, లక్ష్మీనరసింహరావు, గద్దె రాంబాబు, శీలం చిన సైదులు, బొర్ర వెంకటయ్య, గద్దె వెంకటేశ్వర్లు, మేళ్ళచెర్వు చిన బిక్షం తదితరులు పాల్గొన్నారు.